- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయటపడ్డ కుంభకోణం: 10 కేసులు.. రూ.68లక్షల జరిమానా
దిశ, శేరిలింగంపల్లి: మీటర్లు ఉన్నా వాటిని చెడగొట్టారు. జీరో రీడింగ్ చూపించేలా చేశారు. 15 నెలలుగా దర్జాగా కరెంటును వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని సోమవారం విద్యుత్ చౌర్య నిరోధక విభాగం అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఖాజాగూడా చిత్రపురి కాలనీలో నివాసముండే సినీ వర్కర్స్ అసోసియేషన్ ట్రెజరర్ మహనంది రెడ్డి చాలాకాలంగా విద్యుత్ బిల్లులు లేకుండా అక్రమంగా విద్యుత్తును వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అపార్ట్ మెంట్ల నిర్మాణానికి సైతం వీటిని వినియోగించాడని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కరెంట్ వాడుకుని టీఎస్ఎస్ పీడీసీఎల్‌కు భారీ నష్టం చేసినందుకు 10 కేసులు నమోదు చేశారు. రూ.68 లక్షల భారీ జరిమానా విధించారు. ఇన్నాళ్లు బిల్లులు చెల్లించనందుకు మరో రూ.9.5 లక్షల జరిమానా విధించారు. స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది సహకారం లేనిదే ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యం చేసే అవకాసం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.