- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖర్చు కోట్లు.. ఆగని కుక్క కాట్లు
దిశ, సిటీ బ్యూరో: మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామంటూ పాలకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా, ఇక్కడి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కన్పిస్తున్నాయి. కనీసం కుక్కలను, దోమలను నియంత్రించలేని దుస్థితి. కుక్కల నియంత్రణ పేరిట ప్రతి ఏటా రూ.10 కోట్లను వెచ్చిస్తున్నా, జనానికి మాత్రం కుక్క కాట్లు తప్పటం లేదు. తాజాగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటనతో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం మరోసారి అలర్ట్ అయింది. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందంటూ ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం క్షేత్ర స్థాయి విధులపై ఎక్కువగా దృష్టి సారించింది.
అవినీతి అక్రమాలతో లక్ష్యానికి తూట్లు
జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాల కారణంగా అసలు లక్ష్యాన్ని పక్కనబెడుతున్నారు. ఏళ్లుగా తిష్టవేసిన అధికారుల అక్రమార్జన వందల కోట్లకు పెరిగిపోతుందే తప్ప కుక్కల నియంత్రణ మాత్రం క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం జరగట్లదన్న విమర్శలున్నాయి. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాజాగా ఓ బాలుడు కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనతో నగరం మరోసారి ఉలిక్కి పడింది. ముఖ్యంగా నగరంలోని సర్కిల్ కు ఒకటి చొప్పున ఉన్న డాగ్ స్క్వాడ్ లోని రెండు బృందాలు ప్రత్యేకంగా కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాల్సి ఉంది. పక్కడ్బందీ చర్యలు చేపడుతున్నామంటూ జీహెచ్ఎంసీ నాలుగు ప్రైవేటు ఏజెన్సీలను నియమించుకున్న, కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం ఈ ఏజెన్సీల పని తీరుకు నిదర్శనం. కుక్కల సంఖ్య పెరగకుండా వీధి కుక్కలను పట్టుకొచ్చి, వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్ నిర్వహించి, తగిన వైద్యం అందించిన తర్వాత దాన్ని వదిలేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కో కుక్కుకు రూ.1500 స్టెరిలైజేషన్ కోసం ఖర్చు చేస్తున్నామని బిల్లులు క్లెయిన్ చేస్తున్న వెటర్నరీ అధికారులు, ఆ ఆపరేషన్లను వాటిని పట్టుకొచ్చిన డాగ్ స్నాచర్లతోనే చేయిస్తున్నట్లు సమాచారం. నెలకు రెండు, మూడుసార్లు వెరటర్నీ డాక్టర్ ను పిలిపించి, తూతూమంత్రంగా స్టెరిలేజేషన్ ఆపరేషన్లు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రత్యేక నైపుణ్యత కల్గిన డాక్టర్ వచ్చినపుడు ఆయన ఆపరేషన్ చేసే తీరును డాగ్ క్యాచర్స్ కు చూపించి, వారే ఆపరేషన్లు చేసేలా వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు కక్కులు ఒక వేళ జనాన్ని కాటు వేసినా, జనానికి రేబీస్ రాకుండా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది. ఈ వ్యాక్సినేషన్ సైతం తూతుమంత్రంగా చేస్తూ లక్షలాది కుక్కలకు వ్యాక్సినేషన్ చేసినట్లు దొంగ లెక్కలతో బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పలువురు అధికారులు ఈ రకమైన దొంగ లెక్కలతో పట్టుబడి, తమ మాతృశాఖకు సరెండరైన ఘటనలు కూడా ఉన్నాయి. దొంగ లెక్కలు, బిల్లులకు సంబంధించిన నేటీకి ప్రధాన కార్యాలయం, జోనల్ స్థాయి వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ల మధ్య సైలెంట్ వార్ కొనసాగుతున్నట్లు సమాచారం. కొన్ని సర్కిళ్లలో రోడ్లపైకి వచ్చిన గెదెలు, బర్రెలు, మేకలు, మేక పోతులను వెటర్నరీ సిబ్బంది అమ్ముకుంటున్నట్లు సైతం ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనూ అధికారులు, సిబ్బంది మధ్య పంపకాల పంచాయతీ కొనసాగుతున్నట్లు సమాచారం.
మూగజీవాల తిండిని బుక్కేస్తున్నారు
రోడ్లపై స్వైర విహారం చేసే కుక్కలను నగరంలోని ఐదు యానిమల్ కేర్ సెంటర్లకు తీసుకెళ్లి, దానికి మొట్టమొదటి యాంటీ రెబీస్ వ్యాక్సిన్ ఇచ్చి, దానికి స్టెరిలైజషన్ (సంతానోత్పత్తి శక్తిని తొలగించటం) ఆపరేషన్ జరిగిందా? లేదా? అన్న విషయాన్ని నిర్థారణ చేసుకుని, ఒక వేళ జరగకపోతే వెంటనే స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసి, యానిమల్ కేర్ సెంటర్‌లో దానికి పౌష్టికాహారం (కేవలం వెజ్) పెట్టి, అది కోలుకున్న తర్వాతే దాన్ని తీసుకువచ్చిన చోటే వదిలేయాల్సి ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీలోని దాదాపు అన్ని సర్కిళ్లలో ఈ రకంగా పట్టుకొచ్చిన కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయకుండానే చేసినట్లు, వ్యాక్సినేషన్ చేయనిదే చేసినట్లు రికార్డులు సృష్టించి సర్కిల్ వెటర్నరీ విభాగాధిపతి మొదలుకుని కింది స్థాయి వరకు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వెటర్నరీ అధికారులు ఎంతకి దిగజారి పోయారంటే పట్టుకొచ్చిన కుక్కలకు మంచి క్వాలిటీ రైస్ ను ఉప్పు, కారంతో ఉడికించి వేడి వేడి ఆహారం పెట్టాలన్న నిబంధన ఉంది. కానీ సర్కిళ్లలోని వెటర్నరీ అధికారులు రేషన్ బియ్యం ఉడికించి వాటికి పెడుతూ, సన్న బియ్యం పెట్టినట్లు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు తెలిసింది.
ఆ సిఫార్సులు ఏమైనట్టు?
రెండేళ్ల క్రితం నగరంలోని అంబర్ పేటలో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కుక్కల నియంత్రణ, కుక్క కాట్ల నివారణ కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు అంశాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఒక్కో డివిజన్ కు ఒక్కో వెటర్నరీ సూపర్ వైజర్‌ను నియమించాలన్న రికమెండ్ తో పాటు మరో 20కి పైగా సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సుల్లో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కటి కూడా అమలు చేయకపోవటం గమనార్హం.