- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్వీలో అంతర్గత కుమ్ములాట.. ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఘర్షణ
దిశ, సికింద్రాబాద్: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటలు కూడా కాకముందే ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన టీఆర్ఎస్వీలో వర్గపోరు బహిర్గతం అయింది. టీఆర్ఎస్వీలో ఎన్నో రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టీఆర్ఎస్వీలో గత కొన్నేళ్లుగా ఎవరికి వారు వర్గాలు ఏర్పాటు చేసుకుని తమకు నచ్చిన రీతిలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతంలోనూ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ విషయంలో ఎవరికి వారు కమిటీని ప్రకటించుకున్నారు. దీనిపై అధిష్టానం ఆగ్రహించి కమిటీలను రద్దు చేసింది. అప్పటి నుంచి ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు వ్యవహరించసాగారు. ఇప్పటి వరకు ఈ రెండు వర్గాలు కలిసి ఒక్క కార్యక్రమాన్ని కూడా సమిష్టిగా నిర్వహించలేదు.
తాజాగా బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా శుక్రవారం నిర్వహించిన వేడుకలను సైతం వేర్వేరుగానే జరుపుకున్నారు. గత రెండు రోజులుగా ఎవరికి వారు ఓయూ పరిధిలోని వివిధ కళాశాలలకు కమిటీలను ప్రకటించుకున్నారు. ఒక వర్గం ఇప్పటికే వర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల, లా కళాశాల, సైన్స్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలకు కమిటీలను ఏర్పాటు చేసుకుంది. మరో వర్గం ఆర్ట్స్ కళాశాల కమిటీని శనివారం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా ఇంకో వర్గం దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఏర్పాటు చేస్తున్న కమిటీలో అసలు విద్యార్థులు లేరని ఆరోపిస్తూ ఘర్షణకు విద్యార్థి నాయకులు ఘర్షణకు దిగారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతిపజేసి అక్కడి నుంచి పంపించివేశారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.