- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sri Bhagyalakshmi Temple : చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయానికి పోటెత్తిన భక్తులు
దిశ, చార్మినార్ : దీపావళి ఉత్సవాలలో భాగంగా చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో రెండవ రోజు శుక్రవారం అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రముఖులతో చార్మినార్ పరిసరాలు సందడి సందడిగా మారాయి. వేలాదిమంది భక్తులతో చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ శశికళ ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే విఐపి భక్తుల కోసం వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన నాణంపై ఒకవైపు భాగ్యలక్ష్మి అమ్మవారి ప్రతిమ, మరో వైపు చారిత్రాత్మక చార్మినార్ ను ముద్రించారు. దీపావళి ఉత్సవాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేకంగా తయారుచేసిన అమ్మవారి నాణాలను కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా లక్షల నాణాలతో అమ్మవారికి పూజలు చేసిన అనంతరం గురువారం రాత్రి 7 గంటల నుంచి అమ్మవారి ఖజానాను భక్తులకు అందజేస్తున్నారు. చార్మినార్ నుంచి గుల్జార్ హౌజ్ వరకు క్యూలైన్లలోను భక్తులు బారులు తీరి ఉన్నారు. ఇప్పటి వరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించిన ప్రముఖులలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, బీజేపీ జాతీయ నాయకులు డాక్టర్ కే. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, వెంకయ్య నాయుడు కోడలు రాధ, హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, ఎమ్మెల్సీ మధు సూధన చారి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి, టియుడబ్ల్యూ జె కార్యదర్శి వి. యాదగిరి తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు మేడం రెడ్డి, రాహుల్ రావు, కే. వెంకటేష్, జీహెచ్ ఎం సి సౌత్ జోన్ జోనల్ కమిషనర్ వెంకన్న తదితరులు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.