రేపు నగరంలో ట్రాఫిక్​ మళ్లింపులు

by Javid Pasha |
రేపు నగరంలో ట్రాఫిక్​ మళ్లింపులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్టీఆర్ ​వందో జయంతి ఉత్సవాల నేపథ్యంలో కైత్లాపూర్ ​గ్రౌండ్​లో శనివారం జరుగనున్న కార్యక్రమాన్ని పురస్కరించుకుని కూకట్​పల్లి ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్​ కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు ఇరవై వేల మంది పాల్గొనవచ్చని భావిస్తున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 10గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఆంక్షలు విధించినట్టు చెప్పారు. వీటి ప్రకారం మూసాపేట్​నుంచి కేపీహెచ్బీ నాలుగో ఫేజ్, హైటెక్ ​సిటీ వైపు వచ్చే వాహనాలను మూసాపేట్ ​చౌరస్తా నుంచి కూకట్​పల్లి బస్టాప్, జేఎన్టీయూ జంక్షన్ ​వైపు మళ్లించనున్నట్టు తెలిపారు.

ఐడీఎల్ నుంచి మాదాపూర్, హఫీజ్​పేట్​వైపు వచ్చే వాహనాలను ఐడీఎల్​ జంక్షన్ ​నుంచి కూకట్​పల్లి బస్టాప్, కేపీహెచ్బీ రోడ్డు నెంబర్​1, జేఎన్టీయూ జంక్షన్​వైపు మళ్లిస్తామన్నారు. హైటెక్​సిటీ నుంచి కూకట్​పల్లి, మూసాపేట్​వైపు వచ్చే వాహనాలను కేపీహెచ్బీ నాలుగో ఫేజ్​వద్ద మళ్లించి లోదా అపార్ట్​మెంట్స్, కేపీహెచ్బీ రోడ్డు నెంబర్​1వైపు మళ్లించనున్నట్టు చెప్పారు. పర్వత్​నగర్, మాదాపూర్​ వైపు నుంచి కూకట్​పల్లి, మూసాపేట్​ రోడ్డు వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ సిగ్నల్​ చౌరస్తా నుంచి మళ్లిస్తామన్నారు. ఇటుగా వచ్చే వాహనదారులు ఎడమ వైపు తిరిగి వంద అడుగుల ముందుకెళ్లి యూ టర్న్​తీసుకోవాల్సి ఉంటుందని తెలియచేశారు.

Advertisement

Next Story