పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: సీపీఐ

by S Gopi |
పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: సీపీఐ
X

దిశ, శేరిలింగంపల్లి: పేదల పొట్టకొట్టి, పెద్దలకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచుతుందని, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి వంటగ్యాస్ ధరలను పెంచారని విమర్శించారు సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ. మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్ హోండా చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సీపీఐ శ్రేణులు ఖాళీగ్యాస్ సిలిండర్లతో నిరసన చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలపై మోయలేని భారం మోపుతున్నారని, నిత్యవసర ధరలు పెరగడంతో ఏమీ కొనలేని, తినలేని పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. పేదల దగ్గర ముక్కుపిండి వసూల్ చేస్తూ పెద్దల కడుపులు నింపుతున్నారని, వేలకోట్ల రూపాయల సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని, కానీ వాటిపై దృష్టి పెట్టని కేంద్ర ప్రభుత్వం, నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు బేషతరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కె. చంద్ర యాదవ్, కె. వెంకటస్వామి, ఇజ్జత్ నగర్ కార్యదర్శి కె. ఖాసీం. ఎస్ కొండల్. ఎస్. నరసమ్మ. జె శ్రీనివాస్, ఏవైఎఫ్. గీత, నరసయ్య దేవేందర్, ఎం. వెంకటేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed