ఎంపీ డీకే అరుణ ఇంటిని పరిశీలించిన సీపీ

by Aamani |
ఎంపీ డీకే అరుణ ఇంటిని పరిశీలించిన సీపీ
X

దిశ, జూబ్లీహిల్స్: బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు ఫేస్ మాస్క్, గ్లౌస్ వేసుకుని చొరబడ్డాడు. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఆగంతకుడు ప్రవేశించి, లోపల మొత్తం కలియతిరిగాడు. ఈ విషయమై డీకే అరుణ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆగంతకుడు ఎవరా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన పై బీజేపీ ఎంపీ డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భద్రత కరువైందని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త తెలంగాణ దుమారం రేపింది. ఈ ఘటనపై హైదరాబాద్ నగర కమిషనర్ సీ.వి.ఆనంద్ జూబ్లీహిల్స్ లోని డీకే.అరుణ ఇంటిని సోమవారం ఉదయం వెళ్లి పరిశీలించారు. ఇంట్లోకి దొంగ వచ్చి వెళ్లిన తీరును , దారులను డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి లతో కలిసి సీపీ సీవీ.ఆనంద్ పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు తగిన సూచనలను పాటించాలి అని , డీకే అరుణ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీ నీ ఏర్పాటు చేశారు.

Next Story