- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
hundi Counting : లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ హుండీల లెక్కింపు
దిశ, చార్మినార్ : హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలోని రెండు హుండీలను బుధవారం లెక్కించారు. హైకోర్టు ఆదేశాల మేరకు బోనాల జాతర సందర్భంగా లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలోని మూడు హుండీలలో వచ్చే కానుకలు, నగదును నూతన బ్యాంక్ ఖాతాలో జమచేయాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ ఆధ్వర్యంలో సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ సమక్షంలో రెండు హుండీలను లెక్కించగా
రూ.3 లక్షల 31వేల 301 ఆదాయం వచ్చింది. మరో హుండీకి సంబంధించిన తాళాలు తెరుచుకోకపోవడంతో ఆ హుండీకి అధికారులు సీల్ వేశారు. హండీల లెక్కింపులో వచ్చిన రూ.3 లక్షల 31వేల 301 ఆదాయాన్ని సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం పేరిట నూతన బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి అందులో జమ చేశారు. అతి త్వరలో మూడవ హుండీ తాళాలు కూడా తెరిచి, అందులో వచ్చిన ఆదాయాన్ని కూడా నూతన బ్యాంక్ ఖాతాలో జమచేయనున్నారు. హుండీ లెక్కింపులో
చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అంజనా రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సురేందర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజేందర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శులు మారుతి యాదవ్, చంద్రకుమార్, కోశాధికారి సతీష్ ముదిరాజ్, కన్వీనర్ జి.అరవింద్‌కుమార్ గౌడ్, మాజీ చైర్మన్లు విష్ణుగౌడ్, బంగ్లారాజు యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, మాణిక్ ప్రభుగౌడ్, కె.వెంకటేష్, రాజ్‌కుమార్ యాదవ్, సభ్యులు సంగ ప్రకాష్, వినోద్‌కుమార్, విఠల్, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- hundi Counting