మహిళలకు సమాన హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ యే : హనుమంతరావు

by Sridhar Babu |
మహిళలకు సమాన హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ యే : హనుమంతరావు
X

దిశ, నల్లకుంట : దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కును కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు గుర్తు చేశారు. బుధవారం బాగ్ అంబర్ పేట్ డివిజన్ లో గ్రేటర్ హైదరాబాద్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమంతరావు హాజరై జీహెచ్ఎంసీ మహిళా కార్మికులను సత్కరించి బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చట్టసభలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహించారని అన్నారు. ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ అభివృద్ధి చెందుతున్నా ఎక్కడో ఒకచోట వివక్ష జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, సత్తిబాబు లక్ష్మణ్ గౌడ్, హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ కుమార్ అజిత్ యాదవ్, ఆది, అవినాష్, జమీర్, జాంగిర్, శ్రీధర్ గౌడ్, కిషోర్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed