- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల బైఠాయింపు..
దిశ,కార్వాన్ : అదానీ కుంభకోణం పై విచారణ జరిపి సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.గురువారం గన్ పార్క్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మొదట గన్ పార్క్ వద్ద ప్రదర్శన చేసిన అనంతరం జెండాల ప్రదర్శనలతో ర్యాలిని నిర్వహించిన అనంతరం ఈడీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ట్రాఫిక్ ను దారి మళ్లించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్,దానం నాగేందర్, వీ హెచ్ హనుమంతరావు,ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, లతో పాటు శ్రీ గణేష్,మైనంపల్లి రోహిత్,మైనంపల్లి హనుమంతరావు,రాజ్ ఠాగూర్,గడ్డం వివేక్ వెంకట స్వామి,తదితరులు పాల్గొన్నారు.