- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సికింద్రాబాద్ లో కాంగ్రెస్ సగం ఖాళీ
దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులు తనకున్నాయని, ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోముల ప్రకాష్ గౌడ్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీలో పని చేసిన నోముల ప్రకాష్ , ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి పార్టీలో చేరారు. టికెట్ దక్కకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఈ మేరకు పద్మారావు గౌడ్ తో కలిసి శుక్రవారం సీతాఫల్మండిలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సగం ఖాళీ అయిందన్నారు. తన గులాబీ గూటికి నోముల ప్రకాష్ తిరిగి రావడం సంతోషకరమన్నారు. ఇంకో రెండు రోజుల్లో మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. గతంలో కంటే భారీ మెజారిటీతో గెలిచి ఈసారి హ్యాట్రిక్ సాధిస్తానని అన్నారు.బీజేపీతో తనకు పోటే లేదని, ఉన్న కాంగ్రెస్ సగం ఖాళీ అయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీ తమతో పోటీ అనుకొనే స్థాయిలో లేదని రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు రాచూరి సునీత, సామల హేమ, సురేష్ లాల్ తదితరులు పాల్గొన్నారు.