కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదు.. బీఆర్ఎస్‌కు ఓటేస్తే ఆ ఓటు వృథానే: మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజెేందర్

by Shiva |
కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదు.. బీఆర్ఎస్‌కు ఓటేస్తే  ఆ ఓటు వృథానే: మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజెేందర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రితో, నిన్నటి వరకు సీఎంగా ఉన్న కేసీఆర్‌తో కొట్లాడి‌న.. నేనేంటో మీ అందరికీ తెలుసని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రామంతపూర్, సఫిల్‌గూగ ప్రాంతాలలో ఓటర్లను కలుస్తూ కేంద్రంలో బీజేపీ పార్టీని గెలిపించాల్సిన అవసరం‌పై వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ స్థాయిలో 11వ స్థానంలో ఉన్న మన దేశాన్ని ప్రస్తుతం మోడీ పాలనలో ఐదో స్థానికి చేరిందని ఆ స్థానాన్ని మూడో స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశం రూపు రేఖలు మారిపోయాయని టెర్రరిస్టుల దామోదలు లేవని తెలిపారు. పుల్వామా దాడి చేసిన టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్ చేసి హెచ్చరించారని, రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో విద్యార్థులను తిరిగి భారత్‌కు సమర్ధవంతంగా తీసుకువచ్చిన ఘనత మోడీకే దక్కిందని అన్నారు. 500 ఏళ్ల కాలంగా ఎదురుచూస్తున్న రామ మందిర నిర్మాణం మోడీ సారధ్యంలో సకారం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. మల్కాజ్‌గరి ప్రాంతానికి మోడీ వస్తున్నారని ఆ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

హుజూరాబాద్‌లో ఆగం పట్టించారు

వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని గతంలో కన్నా ఈసారి ఆ పార్టీకి స్థానాలు తగ్గుతాయని తెలిపారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది దండగే అవుతుందని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేసిన హుజురాబాద్ నియోజకవర్గం వెళ్లలేకపోయారని, ఆ సందర్భంలో నమ్మిన వాళ్లు ఆగం పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి కళ్లు అప్పుడే నెత్తికి ఎక్కాయని, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 2010 ఎన్నికలలో మా ఓటు ఈటలకే మిగతా పార్టీల వారు మా ఊరికి రావద్దు అని హుజురాబాద్ నియోజకవర్గం మార్చనాపల్లిలో బ్యానర్ కట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే రీతిన ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed