ఉస్మానియా ఆసుపత్రి వద్ద హోంగార్డుల ఆందోళన...

by Sumithra |   ( Updated:2023-09-06 11:14:53.0  )
ఉస్మానియా ఆసుపత్రి వద్ద హోంగార్డుల ఆందోళన...
X

దిశ, కార్వాన్ : హోంగార్డ్ రవీందర్ కు మద్దతుగా బుధవారం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వద్ద హోంగార్డ్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నానికి నిరసనగా రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల విధులు బహిష్కరణకు పిలుపునిచ్చారు. రవీందర్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆత్మహత్యాయత్నం పై వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించాలనీ డిమాండ్ చేశారు.

హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలి..

సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలి తమ న్యాయమైన డిమాండ్ల పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు విధులు బహిష్కరిస్తామని రేపట్నుంచి హోంగార్డులు ఎవ్వరు విధుల్లో ఉండకూడదని పిలుపునిచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed