- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > collector : మలక్ పేట అంధ బాలికల పాఠశాల సంఘటన పై విచారణకు త్రిసభ్య కమిటీ..
collector : మలక్ పేట అంధ బాలికల పాఠశాల సంఘటన పై విచారణకు త్రిసభ్య కమిటీ..
by Sumithra |
X
దిశ, హైదరాబాద్ బ్యూరో : మలక్ పేటలోని ప్రభుత్వ అందబాలికల పాఠశాలలో ఎనిమిది సంవత్సరాల అంధ బాలిక పై అత్యాచారం సంఘటన పై హైదరాబాద్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభం, శుభం తెలియని అమాయక బాలిక పై జరిగిన అత్యాచార సంఘటన పై ప్రసార మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందించి ఇంచార్జ్ వార్డెన్ బీ స్వప్నను సస్పెండ్ చేశారు.
అనంతరం మాట్లాడుతూ సంఘటన పై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన జాయింట్ కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీలో చైర్మన్ గా వికలాంగుల సాధికారత శాఖ డైరెక్టర్, కమిషనర్ బీ.శైలజ, కమిటీ సభ్యులుగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి డి.ఆశన్న, వికలాంగుల సాధికారత శాఖ సహయ సంచాలకులు ఏ.రాజేందర్ లను నియమించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Next Story