బాపుఘాట్ లో గాంధీకి సీఎం నివాళి

by Sridhar Babu |
బాపుఘాట్ లో గాంధీకి సీఎం నివాళి
X

దిశ,కార్వాన్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని లంగర్ హౌస్ బాపుఘాట్ లో బుధవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. స్మారక భవనంలో సర్వమత ప్రార్థన చేశారు. అనంతరం బాపు స్మారక భవనం ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, మేయర్ జి.విజయలక్ష్మి,కేశవరావు, వి.హనుమంత్ రావు, కార్వాన్ ఏ, బీ బ్లాకుల అధ్యక్షులు కూరాకుల కృష్ణ, చంటిబాబు, రఘుపాల్ రెడ్డి, బాపుస్మృతి ప్రతినిధి పరమానందం, బీజేపీ నాయకులు పూర్ణచందర్​రావు, ఆకుల గోవర్ధన్, ఉదయ్ కుమార్ జాతిపిత సమాధికి నివాళులు అర్పించారు.

వీరి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ ఇన్​చార్జి డీసీ నరసింహులు, ఈఈ వెంకట శేషయ్య, జలమండలి సీజీఎం వినోద్ భార్గవ్, జలమండలి జీఎం సుబ్రహ్మణ్యం, మేనేజర్ రమేష్, వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాగా జలమండలి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోస్టర్​ను ఆవిష్కరించారు.

Next Story

Most Viewed