- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో వైద్య విప్లవం.. ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం..
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలను ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో మొత్తం 8,515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు తెలిపారు. 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థకే దక్కాయని చెప్పారు. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం 10 వేల మంది డాక్టర్లను తయారు చేసిందన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివాసీ జిల్లాల్లోనూ వైద్యం పరంగా విప్లవంగా సృష్టించామన్నారు. 2014 తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో 34 వేల పడకలను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 26 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే సంవత్సరంలో మరో 8 కాలేజీలను అందుబాటులోకి వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి వాహనాలతో గర్భిణీ మహిళలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని నియంత్రిస్తూ పేదలను కాపాడుకుంటున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేసీఆర్ కిట్లతో గర్భిణీలకు పౌష్టికారాన్ని పుష్కలంగా అందిస్తున్నామన్నారు. మతా, శిశు మరణాలు రాష్ట్రంలో గణనీయంగా తగ్గాయని చెప్పారు. హైదరాబాద్ సిటీలో మరో 4 టిమ్స్ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.