ఒకవైపు హైదరాబాద్లో తెలంగాణ నిరుద్యోగులకు నిర్బంధాలు.. మరోవైపు చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీకి ఏర్పాట్లు!

by Anjali |
ఒకవైపు హైదరాబాద్లో తెలంగాణ నిరుద్యోగులకు నిర్బంధాలు.. మరోవైపు చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీకి ఏర్పాట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ నూతన సీఎం చంద్రబాబు నాయుడు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రైన తొలిసారి చంద్రబాబు హైదరాబాదుకు వస్తుండటంతో ప్రజాభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పనున్నారు. ఇందుకోసం హైదరాబాదులో సిటీలో పసుపు తోరణాలు.. స్వాగత ఫ్లెక్సీలు, బోనాలు, బతుకమ్మ, డీజేలు అన్ని సిద్ధం చేసి పెట్టాయి. అయితే ఓ వైపు విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరుద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేసేవరకు ధర్నా ఆపమంటూ తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలను, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నగరమంతా నిరుద్యోగుల ధర్నాతో టెన్షన్ టెన్షన్‌గా మారింది. అయితే మరోవైపు చంద్రబాబు నాయుడు మొదటిసారిగా హైదరాబాదుకు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ సీఎం వస్తుండటంతో పోలీసులు విద్యార్థి సంఘాల్ని పోలీసులు ఎవ్వరిని వదలకుండా అరెస్టు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ NRS హాస్టల్లో పలువురు అభ్యర్థులను బయటికి రానీయకుండా పోలీసులు రూమ్‌లోనే నిర్బంధించారు. మరీ ఏపీ నూతన ముఖ్యమంత్రి హైదరాబాబు టూర్ సజావుగా సాగనుందా? అనేది చూడాలి.

Next Story

Most Viewed