ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో వెంకటేష్.. కారణం అదేనా..?

by Kavitha |
ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో వెంకటేష్..  కారణం అదేనా..?
X

దిశ, సినిమా: హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ‘కలియుగ పాండవులు’ అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో వెంకటేష్. ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోవడం వెంకటేష్ స్టైల్. ఆయన సినిమాలన్నీ కూడా కుటుంబ సమేతంగా చూసే విధంగానే ఉంటాయి. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా ఏ రోల్ అయినా సరే వెంకీ మార్క్ తప్పనిసరి. అయితే టాలీవుడ్‌లో అజాత శత్రువుగా పేరుంది హీరో వెంకీకి. దాదాపు అందరూ హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఇష్టపడతారు వెంకీని. జీరో నెగెటివిటీ ఉన్న హీరోల్లో ఫస్ట్ ప్లేస్ వెంకీదే అని అనడంలో అతియోశక్తి లేదు.

ఇదిలా ఉండగా హీరో వెంకీ సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించారు. అయితే వీరందరిలో దివంగత హీరోయిన్ సౌందర్య ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వీరిద్దరు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరీ కాంబోలో ఏ సినిమా వచ్చిన సూపర్ హిట్‌గా నిలిచిపోయేది. దీంతో వెంకీ - సౌందర్య జంట హిట్ పెయిర్‌గా ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పుకార్లు రాయుళ్లు అఫైర్లు కూడా అంటగట్టారు.. అయినప్పటికీ వీరిద్దరూ ఎన్నోసార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఒకానొక సమయంలో తాను సౌందర్య కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు వెంకటేష్.


ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ మాట్లాడుతూ.. పవిత్ర బంధం సినిమా గురించి చెబుతూ ఆ మూవీ రిలీజ్ సమయంలో సౌందర్య కాళ్లను తాను పట్టుకునే సీన్ ఉందని దీనికి సంబంధించిన పోస్టర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందని వెంకీ తెలిపారు. దీంతో చాలామంది తనను భయపెట్టడానికి ప్రయత్నం చేశారు.. కానీ, కథ బాగుంటే జనం చూస్తారని తాను చెప్పేవాడినని.. అనుకున్నట్లుగానే పవిత్ర బంధం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Advertisement

Next Story