పెట్రోల్‌ను నీరులా తాగేస్తున్న యువతి.. తాగకుంటే పూటగడవదంటూ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |
పెట్రోల్‌ను నీరులా తాగేస్తున్న యువతి.. తాగకుంటే పూటగడవదంటూ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, ఫీచర్స్: మానవులకు నీరు ఎంత ముఖ్యమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిండి లేకపోయినా ఉండగలరు కానీ తాగునీరు లేకుండా జీవించలేరు. అయితే డాక్లర్లు కూడా నీరు ఎక్కువగా తాగకుంటే.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పడంతో చాలా మంది పదే పదే నీరును తాగుతుంటారు. ఎక్కడికైనా వెళ్లినా వాటర్ బాటిల్‌ను తీసుకెళ్తుంటారు. నీరు జీవన శైలిలో చాలా ముఖ్యంగా ప్రతి పనికి నీరు అవసరం. అయితే ఈ మధ్య కొందరు నీరులా మద్యాన్ని తాగేస్తూ ఊగుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మధ్యాహ్నం మద్యాన్ని తాగుతున్నారు. కొందరు అయితే మరీ దారుణం ఏకంగా మద్యానికి బానిసలు అయిపోయారు. తిండి లేకుండా అయినా ఉంటున్నారు కానీ చుక్క లేకుండా ఉండలేక పోతున్నారు. తాగి నప్పుడల్లా ఒక పెగ్ అయినా వేస్తున్నారు. తాజాగా, ఓ మహిళ మాత్రం మద్యం, నీరు ఎలా అయితే తాగుతున్నారో పెట్రోల్‌ను అలా సేవిస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. పొద్దున్నే నిద్ర లేచిన కానుంచి మొదలుకుని రాత్రి పడుకునే వరకు పెట్రోల్ తాగకుంటే పూట గడవదట. అది తాగడం వల్ల నష్టాలు కలుగుతాయని తెలిసినప్పటికీ తాగకుండా ఉండలేక పోతుందని తెలుస్తోంది. పూర్తిగా పెట్రోల్‌కు బానిసగా మారిపోయింది.

వివరాల్లోకి వెళితే.. కెనడాలోని ఒంటారియోకు చెందని షానన్ అనే యువతికి చిన్న తనం నుంచి పెట్రోల్ వాసన అంటే చాలా ఇష్టం ఉండేదట. ఆ ఇష్టం కాస్త ఒకరోజు టేస్ట్ చేసేదాక తీసుకువచ్చింది. అదే చివరకు వ్యసనానికి దారి తీసి ప్రమాదకరంగా మారింది. అయితే తాను పెట్రోల్ తాగడంపై షానన్ మాట్లాడుతూ.. ‘‘అది ఆరోగ్యానికి మంచిది కాదని నాకు తెలుసు. ఏదో ఒక రోజు నన్ను చంపేస్తుంది. కానీ పెట్రోల్ తాగే అలవాటును వదులుకోలేక పోతున్నాను. సాస్ తిన్నట్లు అనిపిస్తుంది. టేస్టీగా అనిపించినప్పటికీ కాసేపటి తర్వాత కడుపులో మంటగా కూడా ఉంటుంది. కానీ అది లేకుంటే పూట గడవడం లేదు. ఉదయాన్నే నేను నిద్రలేచిన తర్వాత పెట్రోల్ తాగుతాను. బయటకు ఎక్కడికైనా వెళ్లినా బాటిల్‌లో తీసుకెళ్తాను. రోజుకు 12 టీస్పూన్ల పెట్రోల్ సేవిస్తాను’’ అని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షానన్ పెట్రోల్ తాగడంపై నెట్టింట పలు వార్తలు వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ షానన్ చేస్తుంది తప్పు అని కొందరు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇందులోని విషయాలను ‘దిశ’ ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story