35 కార్పోరేషన్ చైర్మన్‌ల నియామకాలకు ఉత్తర్వులు జారీ

by Mahesh |   ( Updated:2024-07-08 06:25:51.0  )
35 కార్పోరేషన్ చైర్మన్‌ల నియామకాలకు ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కార్పొరేషన్ చైర్మన్ ల నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఏడాది మార్చి 15న 37 మందికి వివిధ శాఖల్లో చైర్మన్లుగా ప్రకటిస్తూ సీఎంవో వర్గాలు ఓ నోట్ రిలీజ్ చేశాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకాలకు బ్రేక్ పడగా తాజాగా విడుదలైన నియామక ఉత్తర్వులతో కాంగ్రెస్ నేతల్లో సంతోషం నెలకొంది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని 35 కార్పోరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించనున్నారు.

Advertisement

Next Story