- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగులకు బిగ్ షాక్.. సెలవులు రద్దు చేసిన సర్కార్
దిశ, సిటీబ్యూరో: వచ్చే నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల విధులకు రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులతో పాటు విదేశీ ప్రయాణాల కోసం శాఖల అనుమతులు తీసుకున్న వారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల విధుల్లో భాగంగా ప్రెసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్లు, అదర్ పోలింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ సిబ్బంది నియామక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సంబందిత శాఖల అధికారుల నుంచి అనుమతి తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది కొరత ఏర్పడంతో వీరంతా వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దీర్ఘకాలిక సెలవులతో పాటు, విదేశాలకు వెళ్లే అధికారులు, సిబ్బందికి అనుమతులు, సెలవులు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.