ORR : మందుబాబులకు షాక్.. ఇకపై ఓఆర్ఆర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు

by Ramesh N |
ORR : మందుబాబులకు షాక్.. ఇకపై ఓఆర్ఆర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మందుబాబులకు Hyderabad హైదరాబాద్ పోలీసులు షాకింగ్ న్యూస్ లాంటి వార్త చెప్పారు. ఇక నుంచి Nehru Outer Ring Road ఓఆర్ఆర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు రాచకొండ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలపై అధ్యయనం చేసిన రాచకొండ పోలీసులు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లు పలు ప్రమాదాలకు కారణంగా నిర్దారించారు. ఈ క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద Drunk and Drive Test డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఔటర్‌పై ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

ఓఆర్ఆర్‌పై ప్రమాదాలు, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు Drunk and Drive డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని Rachakonda Police రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. దేశంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ రాచకొండ. దీంతో అడుగడుగునా నిఘా కోసం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించినట్లు కమిషనర్ సుధీర్ బాబు తాజాగా ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు.

Advertisement

Next Story