BREAKING: సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా గుట్టురట్టు.. 30 మంది అరెస్ట్, భారీగా ఫోన్లు స్వాధీనం

by Shiva |
BREAKING: సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న ముఠా గుట్టురట్టు.. 30 మంది అరెస్ట్, భారీగా ఫోన్లు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో వరుస సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన ముఠా గుట్టు రట్టైంది. వివరాల్లోకి వెళితే.. 30 మంది ఓ గ్యాంగ్‌గా ఏర్పడి నిత్యం నగరంలో ఎక్కడో ఒకచోట సెల్‌ఫోన్లు దొంగిలిస్తూ.. సోమ్ము చేసుకుంటున్నారు. బాధితు నుంచి సమాచారం సేకరించిన హైదరాబాద్ పోలీసులు గ్యాంగ్‌‌ను పక్కా పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి సుమారు రూ.2 కోట్లు విలువ చేసే 713 సెల్‌‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చోరీలకు పాల్పడిన 30 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, దొంగిలించిన సెల్‌ఫోన్లను నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Advertisement

Next Story