తల్లీ కూతురికి ఒకేసారి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం

by Kalyani |
తల్లీ కూతురికి ఒకేసారి భారత్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
X

దిశ, రవీంద్రభారతి : నర్తకీమణి హైకోర్టు న్యాయవాది దువ్వూరి వాచ్ఛల్యేంద్ర, నర్తకీమణి అభిమాణిక యాదవ్ తల్లీకూతురు 90 నిమిషాల పాటు నవ జనార్దన పారిజాతం, పేరిణి తాండవం చేసి భారత వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నారు. జై జవాన్ జై కిసాన్ జై కళాకార్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నారీశక్తి నాట్యమేళ కార్యక్రమం సోమవారం రవీంద్రభారతిలో జరిగింది. శ్రీకృష్ణుడు, శివుడి ప్రత్యేక పాత్రలో ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్స ర్జన్ డా. కాంతిలాల్ జైన్ ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సముద్రాల వేణుగోపాలచారి పాల్గొనగా, భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు లయన్ కేవీ రమణరావు, ఏ.శ్రీధర్, ప్రముఖ నాట్య గురువు పేరిణి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed