Musheerabad Fish Market : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కిటకిటలాడిన చేపల మార్కెట్లు

by M.Rajitha |
Musheerabad Fish Market : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కిటకిటలాడిన చేపల మార్కెట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : బర్డ్‌ ప్లూ(Bird Flu) నేపథ్యంలో చేపల(Fishes) అమ్మకాలకు గిరాకీ పెరిగింది. ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌(Musheerabad Fish Market) ఆదివారం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. నగర నలుమూల‌ల‌ నుంచి జనం చేపలు కొనుగోలు చేయడానికి రావడంతో చేపల మార్కెట్ విపరీతమైన ర‌ద్దీగా మారింది. మాములు రోజుల్లో 40 టన్నుల వరకు అమ్మకాలు సాగించే వ్యాపారులు ఆదివారం ఒక్క రోజు దాదాపు 60 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్టు సమాచారం.

బర్డ్‌ ప్లూ నేపథ్యంలో చికెన్, గుడ్లు ఎవరూ కొనకపోవడంతో చేపలకు బాగా గిరాకి పెరగి, ఇదే అదనుగా వ్యాపారులు భారీగా రేట్లు పెంచారు. మామూలు రోజుల్లో రోహు కిలో రూ. 140 ఉండగా.. నేడు ఏకంగా రూ.200 కిలో అమ్మారు. బొచ్చ కిలో రూ. 120 ఉండగా నేడు రూ. 150, కొర్రమీను రూ. 450 ఉండగా రూ. 550, రొయ్యలు రూ. 300 ఉండగా రూ. 350 ప‌లికినట్లు చేపల వ్యాపారులు చెప్తున్నారు. చేపలు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున జనం రావడంతో మార్కెట్ పరిసరాలు రద్దీగా మారాయి. ముషీరాబాద్‌, సాగర్‌లాల్‌ ఆసుపత్రి, రాంనగర్‌, పార్శిగుట్ట మార్గాల వైపు భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది.

Next Story

Most Viewed