కిడ్నీ వ్యాధులపై అవగాహన కోసం బైక్ రైడ్

by S Gopi |
కిడ్నీ వ్యాధులపై అవగాహన కోసం బైక్ రైడ్
X

దిశ, శేరిలింగంపల్లి: కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆదివారం మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్ గ్రూప్- బంజారా చాప్టర్ తో కలిసి మెడికవర్ హాస్పిటల్స్ వారు బైక్ రైడ్ నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడానికి, కిడ్నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదనే ఉదేశ్యంతో, కిడ్నీల రక్షణే అందరి ప్రథమ ధ్యేయం అనే నినాదంతో మెడికవర్ హాస్పిటల్స్, హార్లీ డేవిడ్సన్ బైకర్స్ సంయుక్తంగా ఈ బైక్ రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ మెడికవర్ హాస్పిటల్స్ అవుట్ పేషెంట్ సెంటర్ నుండి ప్రారంభమై నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా తిరిగి మెడికవర్ హాస్పిటల్స్ చేరుకున్నారు.


ఈ రైడ్ లో 50 మంది బైకర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కమల్ కిరణ్ (నెఫ్రోలజి అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగపు డైరెక్టర్ -మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ )మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే అది కిడ్నీ ఫెయిల్యూర్ గా మారే అవకాశం చాలా ఎక్కువని అన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా వారికి నూతన జీవితాన్ని ఇవ్వొచ్చని, కిడ్నీ వ్యాధుల మీద చైతన్యం పెంచుకోవడమే కాకుండా, ప్రత్యేకంగా కిడ్నీ ఆరోగ్యానికి సంబందించిన ఆహారాన్ని, శ్రద్ధను పెంపొందించుకునే యోచన చేయాలని అన్నారు. 30 ఏళ్ళకు పైబడినవారు, బీపీ లేదా షుగర్ ఉన్నవారు ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి కిడ్నీ స్క్రీనింగ్ చేయించుకోవాలని అయన సూచించారు.

మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ.. కిడ్నీ సేవలకు మెడికవర్ ఆస్పత్రిలో ప్రత్యక విభాగం, ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజీలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు, అత్యుత్తమ సాంకేతికత కలిగిన వ్యాధి నిర్ధారణ పరికరాలు ఉన్నాయనీ, లక్షలాది మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. దేశీయ, విదేశీ రోగులకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లను ఎంతో నైపుణ్యంతో విజయవంతంగా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నెఫ్రోలోజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, సెంటర్ హెడ్ మాత ప్రసాద్, ఇతర వైద్య సిబ్బంది, బైక్ రైడర్స్ పాల్గొన్నారు.

Advertisement

Next Story