Heavy Rains: హుస్సేన్ సాగర్ పరిసర ప్రజలకు బిగ్ అలర్ట్

by srinivas |
Heavy Rains: హుస్సేన్ సాగర్ పరిసర ప్రజలకు బిగ్ అలర్ట్
X

దిశ సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలు జల కళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షం నీరు చేరటంతో జలాశయాల నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా(3.900 టీఎంసీలు), ప్రస్తుత నీటిమట్టం 1779 అడుగులకు ( 1.855 టీఎంసీలు) చేరినట్లు జలమండలి అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులు (2.970 టీఎంసీలు), ప్రస్తుత నీటిమట్టం 1755.55 అడుగులు (1.682టీఎంసీలు) చేరినట్లు అధికారులు తెలిపారు. వీటికి తోడు హుస్సేన్ సాగర్ నీటిమట్టం కూడా పూర్తిస్థాయికి చేరుతున్నట్లు జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారు. ఈ రెండు జలాశయాల నుంచి ప్రస్తుతం ఎలాంటి అవుట్ ఫ్లో లేదని మునుముందు అవసరాలను బట్టి అవుట్ ఫ్లో నిర్ణయించనున్నట్లు తెలిపారు. అలాగే హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, గరిష్ట స్థాయి నీటిమట్టం 514.75 మీటర్లుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 513.21 మీటర్లకు చేరినట్లు జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు. అప్రమత్తమైన జిహెచ్ఎంసి హుస్సేన్ సాగర్ పరివాహ ప్రాంతాలకు ఇరువైపుల నివాసం ఉంటున్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Advertisement

Next Story