- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షాలతో బల్దియా అప్రమత్తం
దిశ, సిటీ బ్యూరో: వర్షాకాలానికి ఇంకా సమయమున్నా, ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఈ సారి జీహెచ్ఎంసీ వానా కాలం కష్ట, నష్టాల నివారణపై కాస్త ముందుగానే దృష్టి సారించింది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ లోని కళాసీగూడలో ఓ చిన్నారి నాలాలో పడి మృతి చెందిన ఘటనతో జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం వచ్చింది. ప్రతి వర్షాకాలంలో చేపట్టే కష్ట, నష్ట నివారణ చర్యలపై కాస్త ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు.
ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ప్రతి భవనాన్ని నేరుగా క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, సెల్లార్ల నిర్మాణం, సెట్ బ్యాక్‌లను చెక్ చేయాలని టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అన్ని సర్కిళ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిలిపేవిస్తున్నట్లు జీహెచ్ఎంసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ప్రమాద నివారణ ప్రమాణాలు పాటించకపోయిన, నిర్మాణానికి భూసార పరీక్షలు నిర్వహించకున్నా వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
తదుపరి నిర్మాణాన్ని కూడా నిలిపివేయాలని పేర్కొంది. ముఖ్యంగా సెల్లార్లలో నీరు నిల్వకుండా నిర్మాణ దారుడు చేపడుతున్న చర్యలను పరిశీలించాలని కూడా సూచించింది. అనుమతి లేకుండా అక్రమంగా సెల్లార్లు తవ్వి, తదుపరి నిర్మాణ ప్రక్రియ లేకుండా ఆగిపోయిన వాటిని గుర్తించి, ఆ సెల్లార్లను గుర్తించి, పరిసర ప్రాంతాల భధ్రత కోసం వాటిని వెంటన్ సీ అండీ డీ విభాగం సహాయంతో డెబ్రీస్ తెప్పించి, సెల్లార్లను మూసివేయాలని సూచించింది.
కొండలు, గుట్టలు వంటి ప్రాంతా ల్లో తవ్వకాలు జరుగుతున్నట్లయితే, వాటిని గుర్తించి ఆ బండరాళ్లు కింది ప్రాంతాల్లో పడకుండా నిర్మాణ దారుడికి అలర్ట్ జారీ చేయాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో ప్రమాద నివారణ ప్రమాణాలను అమలు చేయాలని సూచించింది. ప్రజలకు మరీ ప్రమాదంగా అన్పిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించింది. దీనికి తోడు గ్రేటర్ లోని మొత్తం 30 సర్కిళ్లలో శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలు, అలాగే ప్రజలకు ప్రమాదం అన్పించే భవనాలను గుర్తించి నివేదికను సమర్పించాలని జీహెచ్ఎంసీ సూచించింది.
కార్మికుల భధ్రతపై..
నిర్మాణాలు కొనసాగుతున్న ప్రాంతాల్లోనే గాక, అక్కడ పనిచేస్తున్న లేబర్ నివసించే క్యాంపుల్లో వారికెలాంటి భద్రత కల్పించారన్న విషయంపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. సెల్లార్లు తవ్విన ప్రాంతానికి సమీపంలో లేబర్ క్యాంప్‌లు ఏర్పాటు చేసిన భవన నిర్మాణ దారులకు కూడా నోటీసులు జారీ చేయనున్నారు.