జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం...

by Kalyani |
జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం...
X

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా ఒక బ్యాగు కనపడటంతో, అప్రమత్తమై చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఆ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed