MLA GANDHI : ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలి

by Sridhar Babu |
MLA GANDHI : ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలి
X

దిశ, శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ, సప్తగిరి కాలనీ, భాష్యం స్కూల్ వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రచించాలని, వాహనాల రద్దీ వల్ల ఉదయం, సాయంత్రం వేళలో రహదారులు నిత్యం రద్దీగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందిని,

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ట్రాఫిక్ వలన నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని, ప్రజలకు సాంత్వన చేకూరేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ ట్రాఫిక్ అధికారులకు సూచించారు. అవసరం ఉన్న చోట డివైడర్​లు ఏర్పాటు చేయాలని, రోడ్డు మల్లింపు చర్యలను తీసుకోవాలని, రోడ్డు దాటే వద్ద సూచిక బోర్డులు పెట్టాలని, ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ముత్తు యాదవ్, ఎస్సై రమేష్, గోపాల్, నాయినేని చంద్రకాంత్ రావు, శర్మ, ఎల్లం నాయుడు, వినోద్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed