- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినాయక నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌పై ఏర్పాట్లు పూర్తి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనం విషయంలో కొనసాగుతున్న సస్సెన్స్ కు తెరపడింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, వీహెచ్ పీ, భజరంగ్ దళ్, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు చేపట్టిన నిరసనలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వినాయక (హుసేన్) సాగర్ లో వినాయక నిమజ్జనం చేసేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్ లను సిద్ధంగా ఉంచారు. ఇవికాక ఎన్టీఆర్ మార్గం మీద మరో 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టతను ఇవ్వడంతో నిమజ్జనం విషయంలో ఉన్న గందరగోళం వీడిపోయింది. ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనానికి గాను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు సమీక్షిస్తున్నాయి.
దిగొచ్చిన సర్కార్....
హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం సూచనను భాగ్యనగర్ గణేశ్ ఉత్సక కమిటీ వ్యతిరేకించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టి ధర్నాలకు దిగింది. దీంతో సర్కార్ దిగొచ్చింది. ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నారు. శానిటేషన్, హార్టీకల్చర్, ఎంటమాలజీ, విద్యుత్, ఆర్ ఆండ్ బీ, వాటర్ వర్క్స్, ఆరోగ్యశాఖతోపాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నిమజ్జనం ప్రశాంతంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మార్గాల్లో శుక్రవారం రోజున ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీన్ని అనుసరించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం సాగించాలని పోలీసులు సూచించారు. నిమజ్జనం రోజున ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాల శోభాయాత్రకు తప్ప, ఇతర ట్రాఫిక్ కు అనుమతించరు.
- Tags
- Ganesh immersion