- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: హ్యాట్రిక్ ఖాయమంటూ నామినేషన్ దాఖలు చేసిన ఆరెకపూడి గాంధీ
దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆరెకపూడి గాంధీ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం వివేకానంద నగర్‌లోని తన నివాసం నుంచి భారీ డప్పు చప్పుళ్ళు, బ్యాండ్‌తో పెద్ద ఎత్తున బైక్, కారు ర్యాలీగా బయలుదేరి హైదర్‌నగర్‌లోని విజయదుర్గ మైసమ్మ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ తుల్జాభవానీ టెంపుల్ వద్దకు చేరుకుని ఆనవాయితీగా అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు.
అక్కడి నుండి జోనల్ కార్యాలయానికి చేరుకుని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవీ, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌స్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా బీఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజా ఆశీర్వాదం, వారి దీవెనలతో రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అఖండ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. గడిచిన 9 ఏళ్ల కాలంలో రూ.9 వేల కోట్లతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రతీ కాలనీలో మౌలిక వసతులు కల్పించామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని ఆరెకపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆరేకపూడి శ్యామలదేవీ నామినేషన్
శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆరెకపూడి గాంధీ భార్య శ్యామలదేవీ తన నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.