- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad : పరేడ్ గ్రౌండ్స్ వద్ద మరో స్కైవాక్
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మరో స్కైవాక్(SkyWalk) ను నిర్మించనున్నారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్(Parade Grounds) మెట్రో స్టేషన్ వద్ద ఈ కొత్త స్కైవాక్ ను ఏర్పాటు చేయనున్నారు. మెట్రో ఫ్లైఓవర్ కారణంగా ప్రయాణికులు, పాదాచారులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు జీహెచ్ఎంసీ(GHMC) దృష్టికి వచ్చింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో పరేడ్ గ్రౌండ్స్ జంక్షన్ కూడా ఒకటి. రహదారి దాటి రెండోవైపు రావాలంటే చాలాసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుండటంతో.. ఇక్కడ స్కైవాక్ నిర్మించబోతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదివరకే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వద్ద ఓ స్కైవాక్ నిర్మించగా.. అదే మాదిరిగా ఇక్కడ కూడా మరో స్కైవాక్ రానుంది. దీనివల్ల పాదాచారుల కష్టాలు తీరినట్టే అని నిత్యం ఆ దారిలో ప్రయాణించేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.