- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుస్సేన్ సాగర్‌కు మరింత పర్యాటక శోభ.. సాగర తీరాన మరో పార్కు
దిశ, సిటీ బ్యూరో : హుస్సేసాగర్‌కు అదనపు పర్యాటక శోభ పెరగనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ తీరా కొత్త సచివాలయం, బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, మరో వైపు అమరవీరుల స్మారక స్థూపం వంటివి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో జలవిహార్‌కు అతి సమీపంలోనే హెచ్ఎండీఏ రూ.40 కోట్ల వ్యయంతో మరో పార్కును ఏర్పాటు చేసింది. దాదాపు పనులు పూర్తయిన ఈ పార్కును త్వరలోనే ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాగర తీరాన భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసిన వైపు నుంచి సాగర అందాలను వీక్షించేందుకు వీలుగా ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో వివిధ కోణాల్లో ఏర్పాటు చేసిన స్టీలు బ్రిడ్జిల పైనుంచి సాగర సొబగులను పర్యాటకులు వీక్షించేలా ఈ పార్కును డిజైనింగ్ చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జిల ద్వారా పర్యాటకులను వీలైంత ఎత్తుకు తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జిల పైనుంచి కొత్త సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్ బండ్‌లను పర్యాటకులు వీక్షించేలా ఈ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొత్త సచివాలయం, అంబేడ్కర్ విగ్రహాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ డక్ పార్కు కూడా అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది.
క్యూఆర్ కోడ్‌తో చెట్ల వివరాలు..
ఈ పార్కులో సుమారు నాలుగు వేల పైచిలుకు రకరకాల చెట్లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ చెట్లకు సంబంధించిన వివరాలు పర్యాటకులు తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చెట్టుకు క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్కును సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేయాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సి ఉన్నట్లు సమాచారం.