- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Khairatabad: రేవంత్‌రెడ్డి ఫ్రెండ్‌కు ‘హ్యాండ్ ’.. విజయారెడ్డికి సీటు ఖరారు
దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డికి ఆశాభంగం కలిగింది. కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో ఆయనకు షాక్ తగిలింది. అంతేకాదు అనూహ్యంగా విజయారెడ్డి పేరు ఖరారు అయింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
తండ్రి పీజేఆర్ తనయగా విజయారెడ్డికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. గతంలో ఇదే నియోజకర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆమె ఓడిపోయారు. కానీ ఓట్లు బాగానే వచ్చాయి. ఆ సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విజయారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన డివిజన్ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయారెడ్డి కార్పొరేటర్‌గా గెలిచారు.
అయితే కొద్ది నెలల క్రితం రేవంత్ రెడ్డి పిలుపుతో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే హామీతోనే విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయారెడ్డి పోటీ చేయబోతున్నారు. మరో వైపు కొద్ది నెలలుగా రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ జాబితాలో ఖైరతాబాద్ నుంచి ఆయన పేరు వస్తుందనే ధీమాలో ఆయన, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిన్ రెడ్డికి ఆశాభంగం కలిగింది. కొంతలో కొంత రోహిన్ రెడ్డి సంతోషించే విషయమేంటంటే అంబర్ పేట సీటును కేటాయించారు. మరి ఖైరతాబాద్‌లో రోహిన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడం పట్ల రేవంత్ రెడ్డి సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.
కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఇదే...