- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాంబు కన్నా ఎక్కువ శబ్దంతో పేలుడు.. బెంబేలెత్తుతున్న స్థానికులు
దిశ, జూబ్లీహిల్స్ : హైదరాబాద్‌లోనీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లో గల తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ లో ఈ రోజు (ఆదివారం) తెల్లవారు జామున 4:30 గంటల ప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన స్థానికులకు అలజడి సృష్టించింది. పేలుడు ధాటికి సమీప బస్తీలోని రాళ్లు ఎగిరిపడ్డాయి. పేలుడు ధాటికి భయాందోళనలకు ప్రజలు లోనయ్యారు. పేలుడు తర్వాత మంటలు దట్టంగా వ్యాపించాయి. బాంబు కన్నా ఎక్కువ శబ్దంతో పేలుడు జరగటంతో పేలుడు ధాటికి ప్రహరీ ధ్వంసం అయింది. గోడకు సంబంధించిన ఇటుకలు కింద ఉన్న బస్తీ వాసుల ఇళ్ల పై పడ్డాయి. అందులో ఒక మహిళ తలకు తీవ్ర గాయం అయిందని స్థానికులు తెలిపారు. దీంతో బస్తీలోని ఇళ్లలో వంటసామాగ్రి చెల్లాచెదురయ్యాయి.
ఈ ఘటన పై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలికి క్లూస్ టీమ్, డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు చేరుకున్నాయి. పేలుడు ఘటన పై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడు ఎలా సంభవించిందనే అంశాల పై అగ్నిమాపక శాఖ ఆరా తీసింది. మరోవైపు పేలుడు జరిగిన ప్రాంతానికి బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. పేలుడు ఘటనలో ఆరు ఇళ్లు పూర్తిగా ధ్వంసం.. ఒక మహిళకు గాయాలు అయినట్లు గుర్తించారు. పేలుడు ఎలా సంభవించిందో ఇంకా స్పష్టత రాలేదు. పేలుడు ఘటన పై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పేలుడు ఎలా సంభవించిందో కూడా తమకు తెలియదని హోటల్ సిబ్బంది అంటున్నారు. హోటల్ మేనేజర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటన పై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్యాస్ లీకేజి వల్ల ప్రమాదం జరిగిందని, గ్యాస్ లీకేజి వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఫైర్ క్లూస్ టీం బృందాలతో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. హైడ్రా బృందం కూడా ఘటన పై దర్యాప్తు చేస్తోందని అన్నారు. ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. హోటల్‌కు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అంశాలను పరిశీలిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.