ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నా

by Sridhar Babu |   ( Updated:2023-11-17 13:32:20.0  )
ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నా
X

దిశ, చైతన్య పురి : నియోజకవర్గం ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం ప్రారంభంలో భాగంగా కొత్తపేట డివిజన్ లోని జైన్ మందిర్ నుండి స్నేహపురి కాలనీ వరకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు.

అడుగడుగునా డప్పు చప్పుళ్లు, ఆటలు, పూలవర్షంతో ఆదరిస్తూ మహిళలు మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. కొన్నిచోట్ల కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, బస్తీవాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేస్తామని తీర్మానాలు చేశారు. ప్రజలను కలుస్తూ కళ్లముందు ఉన్న అభివృద్ధి పనులు చెప్తూ తనని పూర్తి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

సీమాంధ్రుల ఆత్మీయ సమ్మేళనం..

హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీ లో స్థానిక సీమాంధ్రవాసుల ఆత్మీయ సమ్మేళనం నరహరిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన రాజప్పనగర్ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర వాసులకు రక్షణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గతంలో సంక్రాంతి పండుగలకు పోయినప్పుడు క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని మంచినీరు,

పూలు ఇచ్చి సాగనంపినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్సీ దయానంద్, ఎల్బీనగర్ భారాస పార్టీ ఇంచార్జి రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, లింగాల నాగేశ్వరరావు, సాగర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్, మహేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు శ్వేత రెడ్డి, విజయా గౌడ్, మహేష్ రెడ్డి, ఉదయ్, యాదగిరి, సాయి కుమార్ గౌడ్, వరుణ్, తాతాలు, తోట వెంకటేశ్వర్లు, కూర్మారావు, నరసింహారావు, భాస్కర్ సాగర్, నరహరిశెట్టి సుమంత్, జగన్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed