- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుమారు రూ. 3 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ కాల్చివేత
దిశ, హైదరాబాద్ బ్యూరో: ఎక్సైజ్ పోలీసుల దాడిలో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ ను సోమవారం అధికారులు దహనం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లోని ఏడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా నమోదైన 219 కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్‌ను హైదరాబాద్ డ్రగ్ డిస్‌పోజబుల్ కమిటీ ఛైర్మన్ కేఏబి శాస్త్రి అదేశాల మేరకు సికింద్రాబాద్ ఏఈఎస్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గంజాయిని బూడిద చేశారు. వీటి విలువ సుమారు రూ. 3 కోట్ల మేర ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఏ పీఎస్ పరిధిలో ఎంత ...
అధికారులు జరిపిన దాడులలో దూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 104 కేసులు, జూబ్లీహీల్స్‌లో 24 కేసులు, కాచిగూడలో 6 కేసులు, మలక్‌పేట్ లో 5 కేసులు, సికింద్రాబాద్‌లో 35 కేసులు, నారాయణగూడలో 23 కేసులు, ముషిరాబాద్‌లో 22 తో కలిపి మొత్తం 219 కేసులు నమోదయ్యాయి. ఈ దాడులలో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా నందిగామ ఈదులపల్లిలో జీకే మల్టికేవ్ ఇండియా ప్రైవేట్ కంపెనీలో దాహనం చేశారు. ఇందులో 756.356కేజీల గంజాయి, 1.315 కేజీ వెట్ గంజాయి, 8 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌ను, 1235.06 కేజీల పాపిస్టను, 06 గంజాయి మొక్కలను, ఇతర రకాలుగా పట్టుబ డిన10 కేజీల హ్యాష్ ఆయిల్, కొకైన్, గంజాయి చాక్లెట్లు 10 కేజీల మేర దగ్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కాల్చివేసిన వాటిల్లో రూ. 1.89 కోట్ల విలువ చేసే గంజాయి, రూ. 62 లక్షల విలువ చేసే పాపిష్ట, రూ. 37 లక్షల విలువ చేసే కొకైన్, రూ. 10 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్, రూ. రెండు లక్షల విలువ చేసే ఎండీఎంఎ, ఎల్‌ఎస్‌డి బ్లాస్ట్స్ మొత్తంగా రూ. 3 కోట్లు ఉంటుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఏడు పోలీస్ స్టేషన్ల సీఐలను, సిబ్బందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్, ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, హైదరాబాద్ డిప్యూటి కమిషనర్ కేఏబి శాస్త్రీ, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి అభినందించారు.