- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూపార్కులో వైట్ టైగర్ అభిమన్యు మృతి
by Shiva |
X
దిశ, చార్మినార్: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ జూపార్క్‌లో అనారోగ్యం కారణంగా వైట్ టైగర్ మృతి చెందింది. 2016 మే నెలలో బద్రి, సమీర అనే వైట్ టైగర్లకు పుట్టిన మగ టైగర్‌కు అభిమన్యు అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయస్సు గల అభిమన్యు ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు జూ అధికారులు తెలిపారు. జూ వైద్యుల బృందం చికిత్సల అందిస్తుండంగా పరిస్థితి విషమించడంతో అభిమన్యు మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. అనంతరం అభిమన్యు మృత దేహానికి వెటర్నరీ వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. కిడ్నీ ఫెయిల్ కావడంతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, జూ పార్కులో జంతువులకు కిడ్నీ వ్యాధుల బారిన పడడానికి మీర్ ఆలం చెరువులోని కలుషిత నీరే కారణమని అధికారులు అనుమానిస్తున్నట్లు తెలిసింది.
Advertisement
Next Story