- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్క్‌లో కరెంట్ షాక్ కొట్టి వ్యక్తి మృతి..
దిశ, సికింద్రాబాద్: పార్క్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తి కాలికి కరెంట్ తీగ తగిలి మృతి చెందిన ఘటన బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని పద్మారావు నగర్ పార్క్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్శిగుట్ట బాబూజీ నగర్ చెందిన ప్రదీప్ (43) రోజు ఉదయం వాకింగ్ కోసం పార్క్‌కు వస్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తున్న క్రమంలో హైటెన్షన్ తీగలు తెగి ట్రాక్ మీద పడ్డాయి. ప్రదీప్ కాలికి విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అయితే కుటుంబ సభ్యులు మాత్రం పార్క్ వద్ద బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని.. గతంలో కూడా ఇలా చాలా సార్లు తీగలు తెగిపడినా పట్టించుకోలేదని పలువురు మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులే తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పార్క్ వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు మద్దతుగా బీజేపీ నాయకులు నిలిచారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం పడినప్పుడు జాగ్రత్త పడాల్సి అధికారులు నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని.. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మేకల సారంగపాణి, మర్రి శశిధర్ రెడ్డి, బండపెల్లి సతీష్ తదితరులు మద్దతు తెలిపారు.