పాతపిల్లర్ లపై నే కట్టిన నాలుగంతస్తుల మేడ

by Sumithra |
పాతపిల్లర్ లపై నే కట్టిన నాలుగంతస్తుల మేడ
X

దిశ, చార్మినార్ : ఒక వైపుకు కుంగిపోయిన నాలుగు అంతస్థుల భవనాన్ని సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. వివరాలలోకి వెళితే పాతబస్తీ బహదూర్ పుర లక్కీ బార్ సమీపంలోని హౌసింగ్ బోర్డింగ్ సొసైటీ లో సుందర్ అగర్వాల్ అనే వ్యక్తికి పాత పిల్లర్ లతో కూడిన ఇల్లు ఉంది. ఇటీవల సుందర్ అగర్వాల్ పాత ఇంటి స్లాబ్ ను డిస్మాండిల్ చేశాడు. కానీ అదే పిల్లర్ ల పై నూతన గృహ నిర్మాణ పనులు చేపట్టాడు. జీహెచ్ఎంసీ నుంచి రెండు అంతస్థుల భవనానికి అనుమతులు తీసుకుని, నాలుగు అంతస్థులు కట్టాడు. అంతేగాకుండా పాత పిల్లర్ ల దగ్గర సెల్లార్ నిర్మాణ పనులు కూడా చేపట్టాడు.

దీంతో కింద ఉన్న పిల్లర్ లకు స్టీల్ సామర్థ్యం సరిపోక పోవడంతో నాలుగు అంతస్థుల భవనం ఒక వైపునకు పూర్తిగా కుంగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు బహదూర్ పురపోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే జీహెచ్ ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప ప్రాంతాలలోని ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం ఉదయం ప్రత్యేక క్రేన్ సహాయంతో ఒక వైపునకు కుంగిపోయిన నాలుగు అంతస్థుల భవనాన్ని నెలమట్టం చేశారు. పాత పిల్లర్ లపై నిర్లక్ష్యంగా నాలుగు అంతస్థుల భవనం యజమాని పై బహదూర్ పుర పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed