రాష్ట్రంలో 70శాతం మందికి కంటి జబ్బులుః స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

by Nagam Mallesh |
రాష్ట్రంలో 70శాతం మందికి కంటి జబ్బులుః స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
X

దిశ, హిమాయత్ నగర్ః పెస్టిసైడ్ ఫుడ్ ప్రభావం ప్రతి వ్యక్తిపై పడుతుందని, ప్రతి వ్యక్తి కండ్ల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం హిమాయత్ నగర్, వాసన్ కంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 161న బ్రాంచ్ ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటువంటి మన కళ్ళు పెస్టిసైడ్ ప్రభావితమైన ఆహారం ద్వారా త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. చిన్నతనం నుంచే కంటి చూపు సమస్యతో 70 శాతం మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ వర్షాకాలంలో మరింత ఈ సమస్యలు ఉధృతమవుతున్నాయనీ, వీటి పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆస్పత్రి ప్రారంభించిన అనంతరం తన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసన్ సీఈఓ వికాస్ జైన్, సర్జన్ డా.లతీష్ ఖాన్, డా.రవి కుమార్, డా.ఆశిష్, డా. పాతిమా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed