- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్శిల్స్
దిశ, సిటీ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలోని మూడు మండలాల్లో 23 ల్యాండ్ పార్శిల్స్ విక్రయానికి సంబంధించిన ప్రీ బిడ్ మీటింగ్ ను హెచ్ఎండీఈ బుధవారం ఆర్సీ పురం లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించింది. హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ కె.గంగాధర్, పటాన్ చెరు తహసిల్దార్ పరమేష్, ఆర్సీ పురం తహసీల్దార్ జయరాంలతోపాటు హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులు, ఎస్టేట్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టీసీ ప్రతినిధులు, బ్యాంకర్లు హాజరయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు దగ్గరలో అమీన్ పూర్, ఆర్సీ పురం, జిన్నారం మండలాలలో పరిధిలో ల్యాండ్ పార్శిల్స్ ఉన్నట్లు వివరించారు. లిమల గ్రామంలోనే అందుబాటులో 121 గజాల నుంచి 3,630 గజాల సైజుల్లో ప్లాట్లు అందుబాటు ధరకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని ఈ ల్యాండ్ పార్శిల్స్ కు వచ్చే నెల 1వ తేదీన మధ్యాహ్నాం ఈ ఆక్షన్ నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు. అమీన్ పూర్ మండలం పరిధిలో పదహారు 16, ఆర్సీపురం మండలంలో 6, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్ పార్శిల్స్ ఉన్నట్లు వివరించారు. వంద శాతం ఎలాంటి చిక్కులు, వివాదాల్లేకుండా క్లియర్ టైటిల్ కల్గిన ఈ ల్యాండ్ పార్శిల్స్ ను కొనుగోలు చేసేవారికి సత్వరమే నిర్మాణ అనుమతులు కూడా లభిస్తాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.