- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలు
దిశ, డైనమిక్ బ్యూరో : భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ విద్యాసంస్థలలో ఒకటైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని బేగంపేటలో 1923లో స్థాపించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. ఏడాది పొడవునా శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో బుధవారం ఏకంగా 3800 మంది విద్యార్థులతో పాఠశాల ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.
ఏడాది పొడవునా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింఫనీ ఆర్కెస్ట్రా ఆఫ్ ఇండియా వారు కొత్తగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది విడుదల చేసిన పాఠశాల గీతం ఆలాపనలో పూర్వ విద్యార్థి, యూకే పార్లమెంట్ సభ్యుడు లార్డ్ కరణ్ బిలిమోరియా పాల్గొన్నారు.
ఈ మేరకు పబ్లిక్ స్కూల్ సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. 'బలమైన సహ-పాఠ్యాంశాల ద్వారా పాఠశాల విద్య ఉత్తమంగా మెరుగుపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. భారతదేశం ప్రధాన వృత్తిపరమైన ఆర్కెస్ట్రాను కలిగి ఉండటం కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు. భారతదేశంలోని సింఫనీ ఆర్కెస్ట్రా నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శన ఇచ్చింది.
ఇది పాఠశాలకు అనేక కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగం అవుతుంది. మంత్రముగ్ధులను చేసే ప్రదర్శన నిజంగా విద్యార్థులకు, ప్రేక్షకులకు శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునేలా ప్రోత్సహించాలనే సంకల్పాన్ని అందించిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను' అని లార్డ్ కరణ్ వ్యాఖ్యానించారు.