హైదరాబాద్ MP అసదుద్దీన్ ఇంటిపై రాళ్ళ దాడి

by GSrikanth |   ( Updated:2023-02-20 02:42:19.0  )
హైదరాబాద్ MP అసదుద్దీన్ ఇంటిపై రాళ్ళ దాడి
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంపైకి రాళ్లు విసిరి కిటికీ అద్దాలు పగులగొట్టారు. దీనిపై అసదుద్దీన్ ఆదివారం అర్ధరాత్రి సమయంలో సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల అసదుద్దీన్ రాజస్థాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అది ముగించుకొని ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఢిల్లీ అశోక్ రోడ్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు ఇంటి కిటికీల అద్దాలను రాళ్ళతో కొట్టి పగులగొట్టారు.

సాయంత్రం 5.30 గంటల సమయంలో దాడి జరిగినట్టు తెలిసిందని అసదుద్దీన్ చెప్పారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు అసదుద్దీన్ ఇంటికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. కాగా, జరిగిన దాడిపై అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడి జరగటం ఇది నాలుగోసారి అని చెప్పారు. తన నివాస పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. ఈసారైనా వాటి ఫుటేజ్ పరిశీలించి దొషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read..

సంచలనం సృష్టిస్తున్న మైనంపల్లి కామెంట్స్! ఆ జిల్లాపై ఇక స్పెషల్ ఫోకస్

Advertisement

Next Story