- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.. హైదరాబాద్ సీపీ సీ.వీ.ఆనంద్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: శారీరకంగా ఫిట్ గా ఉన్నపుడే శాంతిభద్రతల పరిరక్షణలో మరింత మెరుగైన పాత్రను పోషించగలమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ చెప్పారు. వ్యాయామం చేయటంతోపాటు సరైన న్యూట్రీషన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో స్వచ్ఛంధ సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌తో కలిసి కొంతకాలం క్రితం ఫిట్ కాప్ యాప్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా హైదరాబాద్ కమిషనరేట్‌లోని పదహారు వేల మంది సిబ్బందికి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఊబకాయంతో ఉన్నవారితో పాటు వేర్వేరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని గుర్తించారు. ఊబకాయం తగ్గించుకోవటంతో పాటు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన డైట్గురించి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధులు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎప్పటికప్పడు సలహాలు ఇస్తూ వచ్చారు. ఇది సత్ఫలితాలను ఇస్తున్నట్టు కమిషనర్ సీ.వీ.ఆనంద్ చెప్పారు.
హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధుల సూచనలతో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఊబకాయం సమస్య నుంచి బయటపడినట్టు వివరించారు. సిబ్బంది వారి వారి కుటుంబసభ్యులకు కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పంచుకోవాలన్నారు. తద్వారా సిబ్బంది కుటుంబాల సభ్యులు కూడా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారని చెప్పారు. వీలైనపుడల్లా కాలినడకన ప్యాట్రోలింగ్ చేయాలని కమిషనర్సూచించారు. దీనివల్ల ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయని వివరించారు. హెల్పింగ్హ్యాండ్స్ఫౌండేషన్ జరిపిన పరీక్షల్లో అరవైమంది సిబ్బంది ఆరోగ్య రీత్యా హైరిస్క్‌లో ఉన్నట్టుగా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అయితే, ఇచ్చిన సూచనలను పాటించిన వీళ్లంతా సమస్యల నుంచి బయటపడినట్టు చెప్పారన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్హ్యాండ్స్ప్రతినిధులు ఇచ్చిన సలహాలతో సమస్యల నుంచి బయటపడ్డ కొంతమంది సిబ్బంది తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో జాయింట్‌కమిషనర్ (కో–ఆర్డినేషన్) గజరావు భూపాల్, ఐసీసీసీ డీసీపీ సునీతారెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ టీం హెడ్ ముజ్తబా తదితరులు పాల్గొన్నారు.