- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD : సంచిలో మహిళ డెడ్ బాడీ కలకలం
దిశ, బడంగ్ పేట్ : సర్దార్ నగర్ గేట్ ప్రధాన రహదారిలో ఓ సంచిలో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ సర్దార్ పటేల్ నగర్ ప్రధాన రహదారిపై పడి ఉన్న సంచి నుంచి భరించలేని దుర్వాసన వ్యాపిస్తుందని స్థానికులు డయల్ 100 ద్వారా పహాడీ షరీఫ్ పోలీసులు సమాచారం అందుకున్నారు. వెంటనే మహేశ్వరం ఏసీపీ అంజయ్య, పహాడీ షరీఫ్ పోలీసులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
యూరియా సంచిని విప్పి చూడగా 35 సంవత్సరాల గుర్తు తెలియని మహిళ మృత దేహం లభ్యమయ్యింది. ఎరుపు రంగు చీర ధరించి, మెడకు టవల్, చెప్పులు కూడా మూటలో లభ్యమయ్యాయి. నాలుక బయటికి రావడంతో మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యం కావడంతో హత్య చేసి మూడు రోజులు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడో మహిళను మూడు రోజుల కింద హత్య చేసి, తప్పని పరిస్థితుల్లో బుధవారం తెల్లవారుజామున వెహికిల్ లో మూటలో శవాన్ని తీసుకు వెళ్తూ సర్దార్ నగర్ గేట్ వద్ద పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు ముందు అత్యా చారానికి ఏమైనా పాల్పడ్డారా? అనే కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా గత నాలుగు రోజులుగా రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలలో 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మహిళ ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయా అనే కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ అచూకీ తెలిస్తే మర్డర్ మిస్టరీ వెలుగులోకి వస్తుందని మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసును పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.