- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD : బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీకి దొరికిన రెరా కార్యదర్శి, మెట్రో రైల్ ప్రణాళిక విభాగంలో పనిచేసిన అధికారి శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని బాలకృష్ణ లంచాలు తీసుకున్నట్లు తెలిసింది. లే అవుట్ అనుమతుల కోసం శివ బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆయన పర్యవేక్షణలో ఉన్న జోన్లలో సింహభాగం ప్రస్తుతం విలువైన ప్రాంతాలు ఉన్నాయి. ఆయన పరిధిలో ఉన్న జోన్‌లో ఎకరం రూ.20 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది.
హెచ్‌ఎండీఏలోని 3 జోన్లపై శివ బాలకృష్ణకు పట్టు ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రవర్తనా నియామావళికి కొద్ది రోజుల ముందే వట్టినాగుల పల్లి పరిసరాల్లో భూవినియోగ మార్పిడి ఉత్తర్వుల జారీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కమర్షియల్ నిర్మాణాలకు వీలుగా పెద్ద మొత్తంలో భూవినియోగ మార్పిడి చేయడం వెనక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల క్రితమే ఏసీబీ అధికారులకు శివ బాలకృష్ణపై ఫిర్యాదులు రాగా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తేవడంతో చర్యలు తీసుకోలేదని సమాచారం.
అయితే శివ బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహిరంచే ఓ కన్సల్టెంట్‌పైనా ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు.ఇక, ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరారు. ఏసీబీ కోర్టులో ఈ మేరకు కస్టడీ పిటిషన్‌ను అధికారులు దాఖలు చేశారు. ఇక శివబాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్‌పై కాంగ్రెస్ సర్కారు సైతం ఫోకస్ పెట్టింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాల్లో ఫైల్స్ లను స్టడీ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని సైతం నియమించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.