HYD : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-23 04:19:46.0  )
HYD : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సుడాన్ నుండి షార్జా మీదుగా (G9-458) విమానంలో తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన 23 మంది మహిళల లగేజీలలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు స్కానింగ్‌లో గుర్తించారు.

వారి లగేజీ బ్యాగుల నుండి 14 కిలోల 906.3 గ్రాముల బంగారు ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 23 మంది మహిళలను తీసుకొని విచారించగా వారిలో నలుగురు మహిళలు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నలుగురు మహిళలను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.7 కోట్ల 89 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

Next Story