- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: కుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి పరిహారం
దిశ, డైనమిక్ బ్యూరో: అంబర్‌పేట్ వీధి కుక్కల దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి పరిహారం చెల్లించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ రూ. 8 లక్షలు, కార్పొరేటర్లు రూ. 2 లక్షలు మొత్తం రూ. 10 లక్షల పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో బాధిత కుటుంబానికి తమ ఒక నెల వేతనం ఇచ్చేందుకు కార్పోరేటర్లు ముందుకొచ్చారు.
రూ. 2 లక్షలను పరిహారంగా ఇవ్వనున్నారు. ఈ మేరకు మంగళవారం మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ప్రకటించారు. దీంతో పాటు నగరంలో కుక్కల నివారణకు కమిటీ ఏర్పాటు చేయాలని బల్దియా తీర్మానించింది. కాగా, వీధి కుక్కల దాడిలో ప్రదీప్ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో వీధికుక్కలపై జీహెచ్ఎంసీకి వేలలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అప్రత్తమైంది.